వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ విరాళాల లెక్కలు చూస్తే షాకే?

Chakravarthi Kalyan
రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సహజమే.. పార్టీ నుంచి సాయం ఆశించేవారు కూడా పార్టీ ఫండ్‌ కింద విరాళాలు ఇస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పార్టీలు ఏటా తమ ఆదాయం వ్యయం లెక్కలు ఈసీకి చెప్పాల్సి ఉంటుంది. అలా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించాయి. తమ ఆదాయ వ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే సంస్థ ఆ వివరాలను మీడియాకు వెల్లడించింది.

వాటిని బట్టి చూస్తే.. గతేడాది అంటే 2020-21ఈ ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి రూ.107.89 కోట్ల విరాళాలు వచ్చాయట. ఇదే సంవత్సరం టీడీపీకి మాత్రం రూ.3.25 కోట్లు మాత్రమే విరాళాలు వచ్చినట్టు లెక్కలు చూపించాయి. ఇక మరో ప్రధాన పార్టీ టీఆర్‌ఎస్‌కు రూ.37.65 కోట్ల వరకూ విరాళాలు వచ్చాయట. వీటిలో టీఆర్ఎస్‌ రూ.22.34 కోట్లు ఖర్చు చేసింది.  2020-21లో దేశంలోని మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529  కోట్ల ఆదాయం వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: