ఆ చైనా కంపెనీకి గుడ్‌న్యూస్‌ చెప్పిన హైకోర్టు..?

Chakravarthi Kalyan
చైనా మొబైల్ దిగ్గజం షావోమీకి ఇటీవల ఈడీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఏకంగా 5 వేల కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేయాలని ఈడీ కోర్టు చెప్పింది. ఈ షావోమీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందన్న అభియోగాలే ఇందుకు కారణం. అయితే.. షావోమీకి చెందిన 5551కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ జప్తు చేయటంపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చేసింది. ఈ కేసు విచారించిన జస్టిస్ హేమంత్ చందన్ గౌండర్ సారథ్యంలోని వెకేషన్ బెంచ్ స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ కేసు విషయంలో వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు, ఈడీకి కర్ణాటక హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రోజువారీ కార్యకలాపాల కోసం షావోమీ బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఇంతకీ షావోమీపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే.. టెక్నాలజీ రాయల్టీ పేరుతో అమెరికాలోని 2 కంపెనీలకు, చైనాలో ఒకదానికి నిధులు బదిలీ చేసిందట. ఇలా చేయడం ఫెమా చట్టంలోని సెక్షన్ 4ను ఉల్లంఘించడమేనట. అందుకే ఈడీ షావోమీకి చెందిన 5551 కోట్ల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: