ఉక్రెయిన్ యుద్ధం- ఆ దేశాలకు పెనుశాపం?

Chakravarthi Kalyan
ఉరుము ఉరిమి మంగళం మీద పడిందని ఓ తెలుగు సామెత. అంటే.. ఎక్కడో ఏదో జరిగితే..దాని ప్రభావం మరెక్కడో ఉండటం అన్నమాట. ఇప్పుడు అదే జరగుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అనేక ఆఫ్రికా దేశాలకు పెను శాపంగా మారుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా గోధుమలు, ఇతర ఆహార ఉత్పత్తులు, ఎరువుల కోసం ఆ రెండు దేశాలపై ఆధారపడినఈ ఆఫ్రికా దేశాలు పెను ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.
సోమాలియాతో పాటు అనేక ఆఫ్రికా దేశాలు తీవ్ర దుస్థితి ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ యుద్ధం వల్ల పెరిగిన ఆహార, ఇంధన ధరల కారణంగా ఈ దేశాల్లో 5 కోట్ల మంది సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని  వరల్డ్ ఫుడ్‌ ప్రోగ్రామ్ ఆర్థిక వేత్త ఆరిఫ్ హుస్సేన్ వెల్లడించారు. అసలే కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందిపడిన ఆ దేశాలకు ఈ యుద్ధం గోరుచుట్టుపై రోకటి పోటుగా మారిందని ఆయన చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: