టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్(Nikhil Siddhartha)ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ తండ్రి గారైన కావలి శ్యామ్ సిద్దార్థ్ కన్నుమూశారు. దాంతో హీరో నిఖిల్ ఇంట పలు విషాద ఛాయలు అలుముకున్నాయి.హీరో నిఖిల్ టాలీవుడ్ లో మంచి సక్సెస్ ఫుల్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.. స్టార్ హీరో రేంజ్ ను అందుకునే ఈ సమయంలో నిఖిల్ కి ఈ విధంగా తండ్రి మరణంతో పితృ వియోగం కలగడం అనేది ఇప్పుడు అందరిని కూడా కలిచివేస్తుంది.
ఇక నిఖిల్ తండ్రి మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ ను పరామర్శిస్తున్నారు.నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు.