వావ్.. వాళ్లకు అవార్డులు ఇవ్వబోతున్న జగన్?

Chakravarthi Kalyan
జగన్ ప్రభుత్వం కొన్ని అవార్డులు ఇవ్వబోతోంది. అయితే.. ఈ అవార్డులు ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు. ఇవి ఎవరికో తెలుసా.. ఇవి ప్రజాప్రతినిధులకు.. అలాగే అధికారులకు కూడా.. అవును.. పేదల ఇళ్ల నిర్మాణంలో పాలు పంచుకుంటోన్న ప్రజాప్రతినిధులను సన్మానించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న వారిలో మండలానికి ఒక సర్పంచ్ , మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్ ను ఎంపిక చేస్తారట. ఎంపిక చేసి వారికి అవార్డులు ఇస్తారట. అలాగే ఈ పథకం విషయంలో చొరవ చూపించిన వారిలో జిల్లాకు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీకి అవార్డులు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే.. జగనన్న కాలనీలో దాదాపు ప్రతి గ్రామంలో ఏర్పడుతున్నాయి. వాటి విషయంలో తగిన చొరవ తీసుకున్న వారిని ప్రోత్సహిస్తే.. ఈ పథకం మరింత బాగా అమలులోకి వస్తుందని జగన్ భావిస్తున్నారు. తనకు ఈ  పథకం మంచి పేరు తెచ్చి పెడుతుందని జగన్ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: