ఇవాళే నెల్లూరులో అనిల్‌ సభ.. ఏం రచ్చవుద్దో?

Chakravarthi Kalyan
నెల్లూరు లో మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌కూ.. తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి మధ్య వర్గపోరు నడుస్తుందన్న వార్తలు ఉన్న నేపథ్యంలో ఇవాళ నెల్లూరులో ఓ కీలక పరిణామం జరగబోతోంది. మాజీ మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఓ సభ జరగబోతోంది. గాంధీ బొమ్మ సెంటర్‌లో నెల్లూరు సిటీ వైయ‌స్ఆర్ సీపీ కుటుంబ సభ్యులతో సభ పెట్టుకుంటున్నామని మాజీ మంత్రి అనిల్ చెబుతున్నారు. ఇది గడపగడపకూ కార్యక్రమంంలో భాగమని మాజీ మంత్రి అనిల్ ప్రకటించారు. అయితే..ఈ సభ తాజా మంత్రి కాకాణి ర్యాలీని అడ్డుకునేందుకే అన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. అయితే అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు అనిల్ కుమార్ యాదవ్.. మంత్రి కాకాణి స్వాగత ర్యాలీని అడ్డుకునేందుకే తన సభ అన్న ప్రచారం సరికాదన్నారు. ఇది కావాలనే కొందరు చేస్తున్న ప్రచారం అని దాన్ని నమ్మవద్దనిఅంటున్నారు. అయితే.. ఇవాళ ఆ సభలో కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతాన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: