ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చిన జగన్?

Chakravarthi Kalyan
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల పీఆర్సీ విషయంలో జగన్ సర్కారు వారిని ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. 201 ఏడాది చివరి నాలుగు నెలల్లో పెట్టిన ఎర్న్‌డ్  సెలవుల బిల్లులను  ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపేసింది. అలాగే డీఏ ఏరియర్స్ బిల్లులను కూడా జగన్  ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపేసింది.


నిధుల కొరత కారణంగానే ఈ బిల్లులను వెనక్కి పంపినట్టు  అధికార వర్గాలు చెబుతున్నాయి.  జిల్లా డ్రాయింగ్ అధికారుల లాగిన్ లోకి వెళ్లిన ఈ  బిల్లులు ఇప్పుడు వెనక్కి వచ్చాయి. బిల్లులు సమర్పించిన వెంటనే గత ఏడాదే ఉద్యోగులకు ఆదాయ పన్ను కట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఉద్యోగులు ఖంగు తింటున్నారు. మళ్లీ బిల్లు వెనక్కి రావడంతో ఈ బిల్లులను మళ్లీ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇదేం తిరకాసురా నాయనా అని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: