ఇవాళే లాస్ట్ డేట్.. రాచకొండ పోలీసుల బంపర్ ఆఫర్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. వీటిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న విభాగం పోలీసు విభాగం. పోలీసు శాఖలో కానిస్టేబుల్ మొదలుకొని ఎస్‌ఐ, డీఎస్పీ వరకూ అనేక విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిని పెద్ద సంఖ్యలో భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలన్నీ రాత పరీక్షల ద్వారానే భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులకు రాచకొండ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. తమ వెబ్ సైట్‌లో నమోదు చేసుకున్నవారికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. వీరు ఇచ్చే కోచింగ్‌తో ఉద్యోగాల రాత పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. మంచి పట్టుదలతో ఈ అవకాశం వినియోగించుకుంటే పోలీస్‌గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. అందుకే త్వరపడమని చెబుతున్నారు రాచకొండ పోలీసులు. మరి నిరుద్యోగులూ త్వరపడండి. ఉచితంగా ఇచ్చే కోచింగ్ అందుకుని మంచి ఉద్యోగం సంపాదించండి. బెస్ట్ ఆఫ్ లక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: