శ్రీలంకలో కీలక రాజకీయ పరిణామం?
శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో కొన్ని నెలలుగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీని దృష్ట్యానే మంత్రులంతా రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీలంకలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనలు అదుపు చేసేందుకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే మార్చి 31 న ఎమర్జెన్సీ ప్రకటించారు.