పాక్: ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలేది నేడే?
ఎన్నికలు ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. రాజీనామా గురించి అసలు ఆలోచించడం లేదని ఇమ్రాన్ తెలిపారు. అవిశ్వాసంపై చివరి వరకు పోరాడాలన్నది ఇమ్రాన్ వ్యూహం. అయితే.. సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ నుంచి కొందరు ఎంపీలు విపక్షంలోకి ఫిరాయించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినా ప్రభుత్వాన్ని నడపే ఆలోచన ఇమ్రాన్‌కు లేదని తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.