సజ్జనార్ ఉగాది ఆఫర్: ఏ బస్సు అయినా ఫ్రీగానే ప్రయాణం?
65 ఏళ్లు దాటిన వారు ఉగాది రోజు.. ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఇలా 65 ఏళ్ల వయస్సు వారికి ఆఫర్ ఇవ్వడం వారిపై గౌరవం కారణంగానే అని అనుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డు ద్వారా 59 రూపాయలతోనే సెలవు రోజుల్లో మెట్రోలో తిరిగే అవకాశం కల్పించారు. ఇప్పుడు సజ్జనార్ వయోవృద్ధులకు పూర్తి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇస్తున్నారు. అయితే.. కేవలం ఉగాది ఒక్క రోజు మాత్రమే సుమా.