టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రభుత్వానికి ఈడీ షాక్‌?

Chakravarthi Kalyan
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఏకంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు  ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా  నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. అయితే.. హైకోర్టు ఆదేశించినా కూడా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటాను ఈడీకి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని ఈడీ అంటోంది. ఈ డిజిటల్ డాటా వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు చేయడం కష్టమవుతోందని ఈడీ వాదిస్తోంది. అందుకే సోమేష్ కుమార్, సర్ఫరాజ్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: