పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు?

Chakravarthi Kalyan
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. 5 నెలల తర్వాత తాజాగా  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఏపీలో పెట్రోలుపై 88పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. ఈ కొత్త రేట్ల ప్రకారం  విజయవాడలో పెట్రోల్‌ రూ.110.80, డీజిల్‌ రూ.96.83 గా ఉంది. గుంటూరులో పెట్రోల్‌ రేటు రూ.111.21, డీజిల్‌ రూ.97.26గా ఉంది.

ఇక తెలంగాణలో లీటరు పెట్రోలుపై 90 పైసలు పెంచగా..  డీజిల్‌పై 87 పైసలు పెంచారు. కొత్త పెంపు తర్వాత హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రేటు రూ.95.49గా ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడటంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఉదయం 6 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: