టీడీపీ, జనసేన కలిస్తే 160 సీట్లు.. సింగిల్ అయితే..?
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి టీడీపీ - జనసేన కలిస్తే 150 నుంచి 160 సీట్లు వస్తాయంటున్నారు నిమ్మల రామానాయుడు. అదే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 నుంచి 110 సీట్లు వస్తాయట. గత ఎన్నికల్లో ఓడియినా టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చిన విషయం మరిచిపోకూడదంటున్నారు నిమ్మల రామానాయుడు. ఏపీలో అధికారం దక్కాలంటే 88 సీట్లు గెలవాలి. టీడీపీ సొంతంగా పోటీ చేసినా 100 సీట్లు నుంచి 110 సీట్లు వస్తాయని రామానాయుడు చెప్పటం ద్వారా టైట్ ఫైట్ ఉంటుందని చెప్పినట్టయింది.