హోలీ కోసం కేంద్రం కొత్త కాన్సెప్ట్.. మీరూ రెచ్చిపోండి?
మీ అమ్మతో భోజనం చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇలా పంచుకున్న ఫొటోల్లో కొన్నింటిని భారత ప్రభుత్వం తన అధికారిక సామాజిక ఖాతాల్లో ప్రదర్శిస్తుందట. ఈ కొత్త కాన్సెప్ట్ కోసం కేంద్రం ప్రధాని మోడీ తన తల్లితో కలసి భోం చేస్తున్న ఫోటోను ఉదాహరణగా చూపించింది. మీరు కూడా ఇలా మీ అమ్మతో కలసి భోజనం చేయండని సూచిస్తోంది. మరి ఈ కేంద్రం సూచనను ఎంత మంది పాటిస్తారో.. ఎన్ని ఫోటోలు పంపుతారో చూడాలి.