హైదరాబాద్‌లో దారుణం: కుక్క నోట బాలుడి తల

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం పరిధిలోని సహారాలో గుర్తు తెలియని బాలుడి తల కనిపించిన ఘటన కలకలం రేపింది. ఓ బాలుడి తలను కుక్క నోట కరుచుకుని తీసుకెళ్తుండగా చూసిన స్థానికులు షాక్ అయ్యారు. కుక్కను తరిమేసి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు మొదలు పెట్టారు. డాగ్ స్క్యాడ్, క్లూస్ టీం వెంటనే రంగలోకి దిగాయి.


ఎల్బీనగర్‌కు చెందిన కార్తీక్‌ మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో మొదట ఈ దృశ్యం చూశాడు. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం చూసి హతాశయుడయ్యాడు. కుక్కను వెంబడిస్తే అది సహారా ప్రహరీగోడ దగ్గర బాలుడి తల వదిలేసి వెళ్లింది. పోలీసులు  బాలుడి తలను పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: