ఏపీ తెలంగాణకు డేంజర్‌: అడుగంటిన శ్రీశైలం..?

Chakravarthi Kalyan

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇది డేంజర్ సిగ్నల్ అనే చెప్పాలి.. కృష్ణానదిపై కీలకమైన జలాశయం శ్రీశైలం క్రమంగా అడుగంటుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 804 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. ఈ శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. అయితే ప్రస్తుతం కేవలం 804.60 అడుగులు వరకూ మాత్రమే నీళ్లున్నాయి. ఈ శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. ప్రస్తుతం మాత్రం కేవలం 31 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది.


శ్రీశైలం జలాశయంలో నీరు తగ్గడంతో ఆ ప్రభావం శ్రీశైలం మహాశివరాత్రి ఉత్సవాలపైనా పడే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగబోతున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం  పాతాళగంగ చివరి మెట్లు దాటి దిగువన నీరు ఉంది. అందువల్ల జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీశైలం ఈవో లవన్న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: