గుడ్ న్యూస్: శ్రీశైలంలో నేటి నుంచి ప్రత్యేక దర్శనం..?
ఇవాళ, రేపు మధ్యాహ్నం పూట భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది. ఇరుముడి కలిగిన శివ దీక్ష భక్తులను స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి అలంకార దర్శనం ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. మామూలు రోజుల్లో శ్రీశైలం మల్లన్న దర్శనం భక్తులను అలరిస్తుంది. ఇప్పుడు ఏకంగా స్పర్శ దర్శనానికి అనుమతి ఉండటం భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. అందుకే శివ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ ఈ వో కోరుతున్నారు.