హైదరాబాద్‌ నుంచి మియన్మార్‌ స్మగ్లింగ్.. ఏంటో తెలుసా..?

Chakravarthi Kalyan
హైదరాబాద్ నుంచి మియన్మార్‌కు అక్రమంగా తరలిస్తున్న సరుకును ఇవాళ ఈడీ అధికారులు పట్టుకున్నారు. ఇంతకీ ఈ సరుకు ఏంటో తెలుసా.. మీరు అనుకుంటున్నట్టు ఏ డ్రగ్సో కాదు.. మరి.. మీరు అనుకుంటున్నట్టు నకిలీ కరెన్సీ కూడా కాదు.. మరింకేంటి.. గంజాయి అనుకుంటున్నారా అదీ కాదు.. మరి.. నగలు, ఆభరణాలు టాక్సులు ఎగ్గొట్టే బాపతు అనుకుంటున్నారా.. అది కూడా కాదు..


మరి ఇంకేంటి.. తల వెంట్రుకలు.. అవును నిజమే.. హైదరాబాద్ నుంచి మియన్మార్‌కు తల వెంట్రుకలు స్మగ్లింగ్ చేస్తున్న కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు కోసం హైదరాబాద్ నుంచి మియన్మార్ సరిహద్దు వరకు పలుచోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మిజోరం మీదుగా అక్రమంగా వెంట్రుకలు తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో రూ.1.20 కోట్లు, డైరీలు, కొన్న పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం లో మొత్తం 139 బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: