దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా నమోదైన కేసులెన్నంటే..?!

N.ANJI
గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి చైనాలోని వ్యూహన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఎప్పటికప్పుడు తన రూపాంతరాన్ని ఛేంజ్ చేసుకొని ప్రజలను పీడిస్తూనే ఉంది. ఇక కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. అంతేకాదు.. ప్రస్తుతం కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపాంతరం చెంది థర్డ్ వేవ్‌ని కొనసాగిస్తుంది. అయితే మన దేశంలో కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌లను నిర్వహించారు.

అయితే యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గముఖం పడటం లేదు. ఇక కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడుతుంది. కాగా.. ఇక ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. కానీ.. ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75 శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదంట. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోందనే చెప్పాలి మరి.

ఇక గడిచిన 24 గంటల్లో 1,49,394 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 1072 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇండియాలో రోజువారీ కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం వెల్లడించారు. తాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ సానుకూలత రేటు సోమవారం 9.27 శాతానికి తగ్గిందని చెప్పుకొచ్చారు. అంతేకాక దేశంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 14,35,569 ఉన్నాయని పేర్కొన్నారు. కాగా.. గత 24 గంటల్లో 2,46,674 మంది కరోనా నుండి కోలుకున్నట్లు ఆరోగ్య నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: