అయ్యో.. జైల్లలో ఎంత మంది ఉన్నారో తెలుసా..?
అయితే.. తాజాగా కేంద్రం చెప్పిన గణాంకాలు భయం గొలిపేలా ఉన్నయి. దీన్ని బట్టి.. 2020 చివరి వరకు 4 లక్షల 83 వేల మంది భారతీయులు..జైలులో ఉన్నారట. ఈ విషయం జాతీయ నేర గణాంకాల సంస్థ తన NCRB 2020 వార్షిక నివేదికలో తెలిపింది. వారిలో 76శాతం మంది
విచారణలో ఉన్నవారేనట. మరో 23శాతం మంది వరకూ దోషులు ఉన్నారు. మొత్తం ఖైదీల్లో.. దాదాపు 5 వేల మంది విదేశీయులు కూడా ఉన్నారు.
ఇక అండర్ ట్రయల్ ఖైదీల్లో విచారణలో ఉన్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల వారే ఉన్నారు. అంతే కాదు.. దోషుల్లో ఎక్కువగా 35 నుంచి 50 ఏళ్ళ వయస్సు వారు కూడా ఉన్నారు. ఇక దేశంలో మొత్తం ఖైదీల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్షా 6 వేల మంది ఖైదీలున్నారని అంచనా. మరో 52 వేల మందితో బిహార్ సెకండ్ ప్లేస్‌లోనూ.. 45 వేల 456 మందితో మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.