బ్రేకింగ్‌: మంటల్లో కాలిబూడిదైన సికింద్రాబాద్‌ క్లబ్‌..?

Chakravarthi Kalyan
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రముఖ సికింద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ  తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంతో సికింద్రాబాద్ క్లబ్‌ కాలి బూడిదైంది. సికింద్రాబాద్‌ క్లబ్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పది అగ్నిమాపక యంత్రాలతో మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న సంక్రాంతి కారణంగా సికింద్రాబాద్ క్లబ్‌ తెరవలేదు. దీంతో ప్రాణనష్టం తప్పినట్టేనని భావిస్తున్నారు.

భారీగా మంటలు ఎగసిపడిటంతో  సికింద్రాబాద్ క్లబ్‌ పూర్తిగా దగ్దమైంది. ఈ అగ్నిప్రమాదంతో  కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు.  సికింద్రాబాద్ క్లబ్‌కు ఎంతో చరిత్ర ఉంది. 1878లో బ్రిటీష్‌ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ క్లబ్ ఉంది. ఈ సికింద్రాబాద్‌ క్లబ్‌ను భారత వారసత్వ సంపదగా గుర్తించిన కేంద్రం ఓ పోస్టల్‌ కవర్‌ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: