గుడ్‌ న్యూస్‌: పండగ రద్దీ కోసం ప్రత్యేక రైళ్లు..?

Chakravarthi Kalyan
సంక్రాంతి పండుగ కోసం ఊళ్లకు వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోయాని బాధపడాల్సిన పని లేదు.. సంక్రాంత్రి పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 8 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆ రైళ్లు ఏంటంటే..
ఈనెల 14న నర్సాపూర్-విజయవాడ డేమూ రైలు ఉంటుంది.

ఈనెల 13న విజయవాడ నర్సాపూర్ డేమూ రైలు, మచిలీపట్నం-గుడివాడ మెమూ, గుడివాడ మచిలీపట్నం మెమూ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈనెల 14న మచిలీపట్నం-గుడివాడ మెమూ, గుడివాడ-మచిలీపట్నం మెమూ రైళ్లు ఉంటాయి. 13న విజయవాడ-మచిలీపట్నం మెమూ.. 14న మచిలీపట్నం -విజయవాడ మెమూ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.

సంక్రాంతికి రద్దీ కారణంగా అన్ని రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. పండుగకు ఊళ్లకు వెళ్లే వారితో కిక్కిరిసిపోయాయి. ఇలాంటి సమయంలో రైల్వే అందించిన ఈ వార్త పండుగకు వెళ్లే వారికి చాలా ఆనందాన్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: