బ్రేకింగ్ : ఆ నాలుగు జిల్లాల్లో అత్యవసర సేవలకే అనుమతి... ఎక్కడంటే


నాలుగు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. ఈ నాలుగు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి, ట్రాఫిక్ స్తంభించింది. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందినట్లు అధికారిక సమాచారం.
అధికారికంగా ఇప్పటి వరకూ అందిన నివేదికల ప్రకారం, చెన్నై, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటల్లో వర్షాలు ఆగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఇప్పటికీ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
 చెన్నై నగరంలోని డీజీపీ కార్యాలయం, నుంగంబాక్కం సమీపంలోని రెండు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది,  మరో నాలుగు చోట్ల 19 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నీటి ఎద్దడి కారణంగా మొత్తం నాలుగు సబ్‌వేలను మూసివేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం అత్యవసర నిర్ణయం తీసుకుంది. చెంగల్పట్టు, కాంచీపురం,  తిరువళ్లూరుతో పాటు, చెన్నై నగరంలోని నిషేధాజ్ఞలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసి వేశారు. కేవలం అత్యవసర సర్వీసులను మాత్రం అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: