వారికి మ‌రోమారు అవ‌కాశం.. ఎందుకంటే..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇండ్ల ప‌ట్టాల‌తో స‌హా 16 సంక్షేమ ప‌థ‌కాల అర్హులై ల‌బ్దిపొంద‌ని వారికి వారి ఖాతాల్లో నిన్న న‌గ‌దును జ‌మ చేసిన‌ది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు సంక్షేమ ప‌ఖాల ల‌భ్దిని పొంద‌ని వారికి రూ.18.48 ల‌క్ష‌ల మంది ఖాతాల్లో సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి రూ.703 కోట్లను సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి జ‌మ చేసారు. ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం జ‌మ చేసిన న‌గ‌దు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని వారు ఎవ‌రైనా అర్హులు ఉంటే వారు మ‌రొక‌సారి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని సీఎం జ‌గ‌న్ సూచించారు.
అయితే ఈ న‌గ‌దుకు సంబంధించి ప్ర‌తీ సంవ‌త్స‌రం జూన్‌, డిసెంబ‌ర్ నెల‌ల‌లో రెండు ద‌ఫాలుగా అందిజేస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేసారు. డిసెంబ‌ర్ నుంచి మే వ‌ర‌కు అమ‌లు అయిన ప‌థ‌కాలు ల‌బ్ది పొంద‌ని వారికి రెండ‌వ విడుత‌లో అందజేస్తాము అని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా ల‌బ్ధిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా చేప‌డుతున్నాం అని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఈ అవ‌కాశాన్ని అర్హులైన వారంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సీఎం సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: