క‌రోనా : నార్సింగిలో క‌ల‌క‌లం.. క‌ళాశాల‌లో ఎంత‌ మందికంటే..?

N ANJANEYULU
క‌రోనా నూత‌న వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో.. హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో క‌రోనా క‌ల‌క‌లం రేకెత్తించింది. ఒక క‌ళాశాల‌లో దాదాపు 25 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తేలింది. దీంతో  ఆ క‌ళాశాల‌లో తోటివిద్యార్థులు  భ‌యబ్రాంతుల‌కు గుర‌య్యారు. గ‌త రెండు రోజులుగా తీవ్ర చ‌లి, జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న విద్యార్థులు అప్ర‌మ‌త్త‌మై క‌ళాశాల యాజ‌మాన్యం.. ఇవాళ ఉద‌యం విద్యార్థుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌గా.. అందులో 25 మంది విద్యార్థుల‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన‌ది. ఇక అప్ర‌మ‌త్త‌మైన నార్సింగి మున్సిప‌ల్ అధికారులు ఆ కాలేజీలో శానిటేష‌న్ చేసారు. మిగ‌తా విద్యార్థులంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌లు చేసారు. ఇప్ప‌టికే ప‌లు విద్యాసంస్థ‌ల‌లో ఈ త‌ర‌హాలో క‌రోనా కేసులు వెలుగు చూసినా.. మ‌రొక‌సారి ఒక క‌ళాశాల‌లో ఒకేసారి 25 మంది విద్యార్థులకు రావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. ఆ విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రుల‌లోనూ ఆందోళ‌న మొద‌లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: