బ్రేకింగ్ : కేంద్ర మంత్రి మండలి అత్యవసర బేటి... కారణం అదేనా ?


 భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ తన  మంత్రి మండలితో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ప్రభుత్వం ముందన్న తాజా సమస్యలు, ప్రభుత్వ విధానం,  పై చర్చించుతున్నట్లు అధికారిక సమాచారం.  పార్లమెంట్ శీతాకాలసమావేశాలు జరుగుతున్న వేళ  మరోసారి మంత్రి మండలి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,  ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్,  అనురాగ్ సింగ్ ఠాకూర్ నితిన్ గడ్గరీ తో తదితరులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం  నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే పార్లమెంట్ ఉభయసభలను వాయిదా వేయవచ్చని, ఇందుకు మంత్రి మండలి అమోదం అవసరమైన నేపథ్యంలో  ఈ సమావేశం జరుగుతున్నదని పార్లమెంట్ కార్యాలయ సిబ్బంది మీడియాకు సూచన ప్రాయంగా తెలిపారు. అయితే ఇప్పటికే పార్లమెంట్ వాయిదా పడుతుందని మీడియా లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 29న ఆరంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనుకున్నంత సాఫీగా సాగలేదు. నిత్యం ఒడిదుడుకుల తో  సాగీంది. సభలను సజావుగా నడిపించాలని  లోక్ సభ స్పీకర్ , రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతి ఎంత ప్రయత్నించినా  వీలు కాలేదు.  ఫలితంగా సభా సమయం చాలా వృధా అయింది. ఈ విషయాన్ని  పార్లమెంట్ కార్యాలయం అధికారికంగా  తెలిపింది కూడా. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఘటన,  రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల బహిష్కరణ లు మాత్రం  యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి.  ఈ రెండు సమస్యలు మినహా మరో  అంశం కూడా పెద్ద స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించ లేదు.  ఢిల్లీ నగరంలో చలి పెరుగుతుండం తో పాటు కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్  వ్యాప్తి కూడా సభ్యులను భయపెడుతోంది. దీంతో అధికార పార్టీ సభ్యులు సభను వాయిదా వేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉభయ సభలను వాయిదా వేసేందుకుకే మంత్రి మండలి సమావేశం అయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు మంత్రి మండలి సమావేశం ముగిసిన తరువాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: