నల్లగొండలో టీఆర్ఎస్ కు మెజార్టీ ఎంతో తెలుసా..?
నల్లగొండ స్థానంలో మొత్తం 1,233 ఓట్లు ఉండగా.. అందులో చెల్లని ఓట్లు 50 ఉన్నాయి. 1,183 ఓట్లను పరిగణలోకి తీసుకోగా.. అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లను సాధించారు. దీంతో 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి ఘన విజయాన్ని సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి 691 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మరోవైపు మెదక్‌లో 5324, ఖమ్మంలో 247 మెజార్టీతో.. ఆదిలాబాద్‌లో దండె విఠల్, కరీంనగర్లో ఎల్.రమణ, భానుప్రసాద్‌లు విజయం సాధించారు.