ఒమిక్రన్ : ఏపీలో తొలి కేసు నమోదు
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాక విజయనగరం జిల్లాలో మరొక సారి వైద్యపరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ నమోదు అయింది. వెంటనే అనుమానం వచ్చిన వైద్యాధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. దీంతో ఫలితాలలో ఒమిక్రాన్ నిర్థారణ అయింది. దేశంలో ముంబయి, ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒమిక్రాన్ నమోదైన జాబితాలో చేరింది. దేశంలో ఏపీలో వచ్చిన కేసుతో కలిపి ఇప్పటివరకు మొత్తం 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ దృవీకరించింది.