ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేకు నిరసన సెగ
అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారిగా తారమతిపేట గ్రామానికి ఇవాళ హాజరు కావడం గమనార్హం. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీకి చెందిన 21 కాలనీలు చెత్తను గ్రామ సరిహద్దుల్లో వేయడం.. పరిష్కారం అడిగే సరికి ఎమ్మెల్యే మొహం చాటేసారని సమాచారం. గ్రామంలో ఉన్న యువకులు నోరు తెరిసి అడిగేసరికి పోలీసులతో తోపులాట చేయించినట్టు పేర్కొంటున్నారు యువకులు. అదేవిధంగా తారమతిపేట గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేయకుండానే వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరితే.. అతను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.