ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..?
అయితే ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో ఏమి జరిగిందోనని కంగారుపడి బయటికి వచ్చాను. బయటకొచ్చి చూసే సరికి హెలికాప్టర్ చెట్లను తాకుతూ కూలిపోయినది. నేను చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మంటలంటుకొని హెలికాప్టర్ నుంచి బయటికొచ్చి కుప్ప కూలారు. దగ్గరికి వెళ్దామనుకుంటే.. మంటలు, పొగ ఉండడంతో భయపడి అక్కడికి వెళ్లలేక పోయాను అని చెప్పాడు ప్రత్యక్షసాక్షి. హెలికాప్టర్ తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించి చెట్లకు ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.