ఒమిక్రాన్ పై తెలంగాణ వైద్య‌శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న

N ANJANEYULU
తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదు అని ఇవాళ  తెలంగాణ వైద్య శాఖ ముఖ్యంగా ఓ కీల‌క ప్రకటన చేసింది.  ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని  వారికి సంబంధించిన శాంపిల్స్‌ను జీనమ్ ల్యాబ్‌కు  పంపించామ‌ని పేర్కొన్న‌ది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న‌ద‌ని తెలంగాణ వైద్య శాఖ పేర్కొన్న‌ది.

తెలంగాణ‌లో ఎలాంటి ప‌రిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వైద్య‌శాఖ వెల్ల‌డించిన‌ది. జ‌న‌వ‌రి 15 నుంచి క‌రోనా కేసుల సంఖ్య పెరిగి  ఫిబ్ర‌వ‌రిలో పీక్ స్టేజ్ లోకి వెళ్లే అవ‌కాశంఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, ఒల్లునొప్పి, నీర‌సం వంటివి ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు అని.. దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డించిన‌ది. ప్రాణాలు తీసే గుణం ఒమిక్రాన్ లో లేదని నిపుణులు చెబుతున్నారని..థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది వైద్యశాఖ.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: