వెల 'సిరి' : రేపు మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు
కిమ్స్ ఆసుపత్రి వద్ద పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. సిరివెన్నెల మృతి వార్త తెలుసుకున్న తరువాత మెగాస్టార్ చిరంజీవి కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని చూసారు. సీతారామశాస్త్రీ లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రకటించారు పలువురు. సిరివెన్నెల మనకు ఇక లేరు అని, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు.