అయ్యప్ప భక్తులకు శుభవార్త..! వారికి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ అవసరం లేదు
ముఖ్యంగా చిన్న పిల్లల దర్శనం విషయంలో మాత్రం కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో ఇచ్చిన ఆంక్షలను సవరించి తాజాగా ఉత్తర్వులను జారీ చేసినది. అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. పిల్లలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదికను చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించింది కేరళ ప్రభుత్వం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, పిల్లలను వారి వెంట ఉన్న పెద్దవారు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని సూచించింది.
ముఖ్యంగా పెద్దలందరికీ ఈ ఆంక్షలు అమలులోనే ఉంటాయని, ఆలయంలోకి ప్రవేశించడానికి వారందరూ టీకా సర్టిఫికెట్ లేదా ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని కేరళ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది. మరోవైపు కొత్త వేరియంట్ ప్రమాదం ముంచుకువస్తున్న తరుణంల అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచనలు కూడా చేసింది.