జగన్ 2.0 : మళ్లీ సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో వస్తాం : జగన్
రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా.. రాజధానులు చేసి ఉంటే ఈ పాటికి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉండేది. వెనుకబడ్డ ప్రాంతాలు కూడా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేంద్రీకరణ దోరణులు ఒక చోటే పూర్తిగా కేంద్రీకరణ దోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా వెల్లడి అయింది. హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని ప్రజల తీర్పు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్నిమతాలు, అందరి ఆశలు, ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అందుకే ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారు.