నేటి నుంచి జంట న‌గ‌రాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల‌ ర‌ద్దు

N ANJANEYULU
హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో న‌డిచే ఎంఎంటీఎస్ రైళ్ల సేవ‌లు రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ప‌లు సాంకేతిక కార‌ణాల‌తో ర‌ద్దు చేస్తున్న‌ట్టు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్  ప్ర‌క‌టించారు. సోమ‌, మంగ‌ళ‌వారాల‌లో మొత్తం 24 స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్నారు. అయితే ఆదివారం ఫ‌ల‌క్‌నుమా-లింగంప‌ల్లి మ‌ధ్య న‌డిచే నాలుగు రైళ్ల‌ను కూడా ర‌ద్దు చేసారు.

ముఖ్యంగా కొన్ని రైల్వే మార్గాల‌పై మ‌రమ్మ‌తులు చేప‌డుతుండ‌డంతోనే  ఎంఎంటీఎస్ రైళ్ల‌ను ర‌ద్దు చేసామ‌ని అధికారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి లింగంప‌ల్లి వెళ్లే ఎంఎంటీఎస్‌, లింగంప‌ల్లి నుంచి హైద‌రాబాద్ వెళ్లేవి,  అలాగే లింగంప‌ల్లి నుంచి ఫ‌ల‌క్ నుమా కు వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్ల‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  ఎంఎంటీఎస్‌లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు రైళ్ల ర‌ద్దును గ‌మ‌నించి వేరే మార్గంలో ప్ర‌యాణాన్ని ఎంచుకోవాల‌ని సూచించారు. బుధ‌వారం నుంచి య‌ధావిధిగా ఎంఎంటీఎస్ సేవ‌లు కొన‌సాగ‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: