కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్..!
వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లను ఎత్తివేయడంతో వరద నీరు పోటెత్తినది. రెండు రోజులుగా వంతెన వద్ద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయి ఉన్న బ్రిడ్జి అర్థారత్రి దాటిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయినది. ఈ వంతెన అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహనదారుల రాకపోకలన్నీ నిలిచిపోయాయి. మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. వంతెన పునరుద్ధరించేందుకు దాదాపు నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటన్నారు.