కుప్పంలో టీడీపీకి షాక్.. కొనసాగుతున్న వైసీపీ హవా..!
ముఖ్యంగా ఒకటో వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో, మూడో వార్డు లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రత్యూష, నాలుగో వార్డ్ లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా గెలుపొందారు. ఏడవ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షకీలా విజయదుందుబి మోగించారు. 18వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయంతి , 9వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డిలు కూడా విజయం సాధించారు. 14 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్, 15 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజలో ఉన్నారు. టీడీపీ నాలుగు చోట్ల ఆధిక్యంలో కనిపిస్తోంది.