టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఖ‌రారు

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్సీల ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ వేయ‌డానికి ఇవాళే చివ‌రి రోజు కావడంతో ఉత్కంఠ నెల‌కొన్న‌ది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి టీఆర్ఎస్ అధిష్టానం ప్ర‌క‌టిస్తుంద‌ని ఆశించిన అభ్య‌ర్థుల‌కు కాస్త నిరాశ‌గానే మిగిలిన‌ది. ముఖ్యంగా సోమ‌వారం ప్ర‌క‌టిస్తుంద‌ని ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు సీఎం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప‌లువురు మంత్రులు,  ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అప్ప‌టికీ గుత్తాసుఖేంద‌ర్‌రెడ్డి, క‌డియం శ్రీ‌హ‌రి, కౌశిక్‌రెడ్డి, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్  న‌లుగురు పేర్లు ప్ర‌క‌టించిన‌ట్టు వినిపించాయి.

ఐదు, ఆరో స్థానాల‌కు సిద్ధిపేట‌ మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి,  ఉత్కంఠ మ‌ధ్య  బండా ప్ర‌కాశ్‌పేరు ప్ర‌క‌టించారు. బండా ప్ర‌కాశ్ ను క్యాబినేట్‌లోకి తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.   నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు మంగ‌ళ‌వారం రోజు ఆఖ‌రు తేదీ కావ‌డంతో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు కాస్త టెన్ష‌న్ కు గుర‌య్యారు. 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోవాల‌ని పిలుపు వ‌చ్చింది. దాదాపు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులంద‌రూ 10 గంట‌ల‌లోపు ప్ర‌గ‌తి భ‌వ‌న్ చేరుకున్నారు. ఆ త‌రువాత సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన వారికి బీఫామ్‌లు అంద‌జేసారు. వారు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: