ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలోతూర్పు నావికా దలం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌తో వివిధ అంశాలు చర్చించారు నావికా దళం అధికారి. అదేవిధంగా డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వనించారు తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ ఛీఫ్.
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానుందని సీఎంకి వివరించారు. అదేవిధంగా ఫిబ్రవరి 2022లో నిర్వహించే పీఎఫ్‌ఆర్ అండ్ మిలన్ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని ఆయన సీఎంకు వివరించారు.అనంతరం ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్‌ను సన్మానించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేసారు సీఎం వైఎస్ జగన్. సీఎంని కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్‌సీ రావు, కెప్టెన్ వికాస్ గుప్తా, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి, ఫ్లాగ్ లెఫ్టినెంట్ శివమ్ కందారిలు ఉన్నారు.