కేసీఆర్ Vs ఈటెల : ఆరో రౌండ్‌లో అదరగొట్టిన ఈటల
ఆరో రౌండ్ ముగిసే సరికి 3186 ఓట్ల లీడ్‌లో ఉన్నారు ఈటల. మొత్తం 2,36,873 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 2,05,236 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఆరు రౌండ్లలో కలిపి హుజూరాబాద్ టౌన్, మండలం పూర్తయింది. మొత్తం 22 రౌండ్లలో నిర్వహించే కౌంటింగ్‌కు కేవలం 6 రౌండ్లు మాత్రమే అయ్యాయి. ఇంకా 16 రౌండ్లు ఉన్నాయని టీఆర్ఎస్ శ్రేణులు గెలుపు ధీమాలో ఉన్నారు. వీణవంక మండలం లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న మండలాలు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు ఆధిక్యంలో ఉంటుందనుకుంది. కానీ ఇప్పుడు జమ్మికుంటలో ఎలా ఉంటుందో అని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.