ఎస్ హుజూరా బాద్ ఉప ఎన్నిక ల ఫలితం వెల్లడి అవుతోన్న వేళ పలువురు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆయన గెలుస్తారని అంటోన్న చాలా మంది ఆయన వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారని చెపుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం సాయం చేశారని.. తెలంగాణ లో రేవంత్ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీయే వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు ప్రధాన పోటీ దారు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల కూడా బీజేపీ లో ఉన్నా ఉపయోగం లేదని.. ఆయన కాంగ్రెస్ కండు వా కప్పుకుంటారని.. రేవంత్ తో ఆయన టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈటల హుజూరా బాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తారని అంటున్నారు.