కేసీఆర్ Vs ఈటెల: ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌ను త‌ల‌పిస్తోన్న కౌంటింగ్‌.. రెండో రౌండ్ రిజ‌ల్ట్ ఇదే

VUYYURU SUBHASH
హుజూరా బాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 2019 లో జ‌రిగిన వ‌న్డే క్రికెట్ ప్రపంచ క‌ప్ ఫైన‌ల్ ను త‌ల‌పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు రౌండ్లు పూర్త‌యితే రెండు రౌండ్ల‌లోనూ బీజేపీ ఆధిక్య‌త చాటుకుంది. అయితే రెండు రౌండ్ల లోనూ చాలా స్వ‌ల్ప మెజార్టీ మాత్ర‌మే బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల‌కు మెజార్టీ వ‌చ్చింది. తొలి రౌండ్ల‌లో 166 ఓట్ల మెజార్టీ బీజేపీకి వ‌చ్చింది. రెండో రౌండ్లో కూడా కేవ‌లం 193 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 359 ఓట్ల మెజార్టీతో ఈట‌ల కొన‌సాగుతున్నారు. అయితే కారు గుర్తును పోలిన ఇండిపెండెంట్ల‌కు భారీ ఓట్లు ప‌డ‌డంతో ఆ ఎఫెక్ట్ కారు పార్టీపై గట్టిగా ప‌డింద‌ని విశ్లేష‌ణ‌లు చెపుతున్నాయి. మ‌రి తుది ఫ‌లితం ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: