పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

గుండెపోటుతో మరణించిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు రేపటికి వాయిదా వేశారు. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై రేపు అధికార లాంఛనాలతో పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు నివాళులర్పించారు అని బొమ్మై మీడియాకు చెప్పారు. ఇది ఇలా ఉండగా నిన్న మధ్యాహ్నం వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్ రాజ్కుమార్ గుండె పోటు తో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడనుండి బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు.


అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులెత్తేశారు. ఇక పునీత్ రాజ్కుమార్ మరణ వార్త విని యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ పెద్దలు చిరు బాలయ్య తో సహా స్టార్ హీరో ఎన్టీఆర్ పునీత్ రాజ్కుమార్ భౌతిక కాయంను సందర్శించి నివాళులర్పించారు. ఇటీవలే పునీత్ రాజ్కుమార్ నటించిన యువరత్న సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయగా ఆయన తెలుగు వారికి సైతం పరిచయమయ్యారు. అంతేకాకుండా తెలుగు ఆడియన్స్ కూడా పునీత్ రాజ్ కుమార్ డాన్స్ కు ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: