హుజురాబాద్ కేంద్రంగా రాజకీయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గతం కన్నా ఈ సారి సమీకరణాలు బాగా మారిపోనున్నాయి. ముఖ్యంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అంతా తానై నడిపారు కేసీఆర్ మరియు ఇంకొందరు. వాస్తవానికి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన ఆయన నిన్నటి వేళ చాలా ఉద్వేగభరితంగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమాల సమయాన తాను ఎలా పనిచేశానో చెబుతూ, తన కుటుంబ నేపథ్యాన్ని సైతం వివరించారు. ఈ వీడియోలో ఆయన మాతృమూర్తి కూడా ఉన్నారు. ఇక ఇవాళ పోలింగ్ లో తన ఓటు హక్కును హిమ్మత్ నగర్ లో వినియోగించుకున్నారు. రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన ఈటెలను ఇవాళ ఆయన ఢీ కొంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ వెన్నుదన్నుతో ఆయన ఇటుగా పోటీకి అంగీకారం తెలిపారు. ఆయన అభ్యర్థిత్వంపై మొదట కొన్ని అనుమానాలున్నా కౌశిక్ రెడ్డి రాకతో కొన్ని పరిణామాలు వచ్చినా ఇవేవీ కూడా తరువాత కాలంలో నిలదొక్కుకోలేకపోయాయి. ఇప్పుడిక్కడ జరిగే ఎన్నికల యుద్ధం ఓ విధంగా తప్పకుండా టీఆర్ఎస్ కు రెఫరెండమే!