మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం..!

మహబూబ్ నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శీనివాస్ గౌడ్ కు మాతృవియోగం క‌లిగింది. గత రాత్రి గుండెపోటుతో శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మృతి చెందారు. కాగా ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ లో శాంత‌మ్మ‌ అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు. శాంత‌మ్మ గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఆరోగ్యం విష‌మించి గ‌త‌రాత్రి రావ‌డంతో హైద‌రాబాద్ లోని త‌మ నివాసంలో మృతిచెందార‌ని స‌మాచారం.
ఇక శీనివాస్ రెడ్డి త‌ల్లి మృతి చెంద‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మ‌రియు లక్ష్మారెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మంత్రి గంగుల తదితరులు సంతాపం ప్ర‌క‌టించారు. శాంత‌మ్మ‌ ఆత్మకు శాంతి చేకురాలని పేర్కొన్నారు. ఇక త‌న త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద శీనివాస్ గౌడ్ రోధిస్తున్న వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి.దాంతో ఆయ‌న‌కు ప‌లువురు ధైర్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: