బద్వేలు : రోజా రెడ్డీ! అరవకు చెప్పింది చాలు!
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీలో చాలా నాటకం నడుస్తోంది. మెజార్టీ కోసం జగన్ నానా పాట్లూ పడుతున్నాడు. ఈ క్రమంలో మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంకా ఇతర సీమ నాయకుల్నీ తెగ పరుగులు పెట్టిస్తున్నాడు. పెద్ది రెడ్డి, రోజా రెడ్డి కూడా తామే ఎన్నికల బరిలో ఉన్న విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా రోజారెడ్డి చంద్రబాబును ఉద్దేశించి నానా మాటలూ అంది. పూర్వ స్నేహాలు దృష్టిలో ఉంచుకుని కూడా కనీస విజ్ఞత ఆమె పాటించలేదు. గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బద్వేలు ఉప ఎన్నికకు ముందు స్థానిక ఎన్నికలు జరగడం అయినా కూడా కొన్ని చోట్ల రోజా రెడ్డి మాట నెగ్గకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నా, తమ అధినేత ఆదేశానుసారం ఆమె ప్రచారానికి వచ్చారు. పెద్ది రెడ్డితో కలిపి శత్రువు అయినా సరే ప్రచారం చేశారు. ఇప్పుడీ ప్రచారం ఫలితం ఎలా ఉంటుంది అన్నదే ఆసక్తికరం. ముఖ్యంగా రోజా రెడ్డి విమర్శలకు లోటేం ఉండదు. ఆమె చెప్పేది, చేసేది రెండూ వేర్వేరుగా ఉంటాయి. పెద్దిరెడ్డి లాంటి లీడర్లతో ఆమె తగాదాలున్నాయి. అవి తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయినా కూడా చిత్తూరులో తన మాటే నెగ్గాలన్న పంతంలో రోజా తరుచూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిణామాలలో మంత్రి వర్గ విస్తరణ కూడా ఉండడంతో బద్వేలు ఎన్నికల ప్రచారానికి వచ్చి ఏవో నాలుగు మాటలు చెప్పి ఓటర్లను ఆకర్షించే పని ఒకటి చేశారామె!