ఏపీ గవర్నర్ను కలిసిన సీఎం వైఎస్ జగన్ దంపతులు
అదేవిధంగా నవంబర్ 1 వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు సీఎం జగన్. జగన్మోహన్రెడ్డి దంపతులు దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవార్డులను అందజేయనున్నట్టు గవర్నర్కు వివరించారు. దాదాపు 50కి మందికి పైగా ఇవ్వనున్నట్టు వివరించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతిలు గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారు. తనపట్ల తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ కు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో సీఎం జగన్ చర్చించారు.