గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, అసలు మేటర్ ఏంటీ...?

గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. నాలుగో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటల దెబ్బకు అధికారులు కంగారు పడ్డారు. సకాలం లో మంటలు అదుపు చేసారు అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర మాట్లాడుతూ... ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు గాంధీ హాస్పిటల్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందనే సమాచారం వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డ్ లో షాక్ సర్క్యూట్ అయింది అని వ్యాఖ్యలు చేసారు. ఆరో ఫ్లోర్ వరకు పొగలు వ్యాపించాయి అని మూడో ఫ్లోర్ ఎలక్ట్రికల్ రూమ్ లో మంటలు వచ్చాయి అని అన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు అని స్పష్టం చేసారు. 40 నిమిషాల్లో మంటలు, పొగను అదుపులోకి తెచ్చాము అని వివరించారు. పరిస్తితి పూర్తి అదుపులో వుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: