మా పోరు : ప్రకాశ్ రాజ్ పెంట చేస్తున్నాడే ?

RATNA KISHORE
ఒక చిన్న ప‌దవి కోసం ఇంత రాద్ధాంత అవ‌స‌ర‌మా అని చిరు హితోప‌దేశం చేసినా ప్ర‌కాశ్ రాజ్ ప‌ట్టించుకోవ‌డం లేదు. అదే ఆవేశం, అదే ఉక్రోషంతో ర‌గ‌లిపోతున్నాడు. పైకి త‌న మాట‌లు అన్నీ ప్ర‌జాస్వామ‌బ‌ద్ధంగా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డుతూ లోప‌ల మాత్రం ఓట‌మి భారం మోయ‌లేక తెగ అవ‌స్థ‌ప‌డుతున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కొన్ని అటు విష్ణు వ‌ర్గం నుంచి అందుకుంటున్నాడు. ఎందుక‌ని? 

ఎన్నిక‌లు అయిపోయి రోజులు గ‌డుస్తున్నా ప్ర‌కాశ్ రాజ్ లో మార్పు క‌నిపించ‌డం లేదు.  ఎప్పటిక‌ప్పుడు ఏదో ఒక వివాదం లాగుతూనే ఉన్నాడు. ఆయ‌న రాజీనామాల‌ను తాను ఆమోదించ‌న‌ని విష్ణు చెప్పిన నేప‌థ్యంలో వివాదం స‌ర్దుమ‌ణిగింది అని అనుకునేలోగానే కొత్త వివాదం ఒక‌టి తెర‌పైకి తెచ్చాడు. ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్ కు లేఖ రాసి, ఎన్నిక‌ల వేళ  సీసీటీవీ ఫుటేజ్ ను త‌న‌కు అందించాల‌ని కోరాడు. దీనిని పరిశీలించాకే తాను కోర్టుకు వెళ్తాన‌ని అంటున్నాడు. దీంతో వివాదం ఇంకా బాగా పెరిగిపోతోంది. మ‌రోవైపు విష్ణు ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాడు. బాలయ్య‌తో స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాడు. మ‌రి! ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వంకు ఎవ‌రు వ‌స్తారో ఎవ‌రు గైర్హాజ‌ర‌వుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: